NTR30: జాన్వీ కపూర్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే?

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో ‘NTR30’ పాన్ ఇండియా సినిమా వస్తున్న విషయం తెలిసిందే..

Update: 2023-03-08 03:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో ‘NTR30’ పాన్ ఇండియా సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ నుండి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాయి. NTR30తో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెలుగులో మొదటిసారిగా ఎంట్రీ ఇవ్వనుంది. ఇటీవల NTR30 నుండి జాన్వీ కపూర్ విడుదలైన లుక్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. తాజాగా, జాన్వీ రెమ్యునరేషన్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ సినిమాకి జాన్వీ కపూర్ ఏకంగా రూ.15 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తుందట.

Tags:    

Similar News