ఎన్టీఆర్30.. వస్తున్నా అంటూ వీడియో రిలీజ్ చేసిన తారక్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషనల్ వచ్చిన ‘జనతా గ్యారెజ్’ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే.

Update: 2023-04-01 15:08 GMT

దిశ, వెబ్ డెస్క్: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషనల్ వచ్చిన ‘జనతా గ్యారెజ్’ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా వస్తోంది. ఎన్టీఆర్ 30వ సినిమాగా వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ లో తారక్ పాల్గొన్నారు. అందుకు సంబంధించిన వీడియోను తారక్ తన ఫ్యాన్స్ తో పంచుకున్నారు.

ఈ సందర్భంగా మూవీ సెట్ లోకి అడుగుపెట్టిన తన వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన యంగ్ టైగర్.. వచ్చేస్తున్నా అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ కు జోడీగా అతిలోక సుందరి శ్రీదేవి గారాల పట్టి జాహ్వని కపూర్ కనిపించున్నారు. కాగా ఎన్టీఆర్-చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News