ఎన్టీఆర్‌ అంటే లక్ష్మిప్రణతికి ఇష్టం లేదా.. బలవంతంగా పెళ్లి చేశారా? తారక్ షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్‌ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. దర్శకధీరుడు తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్నాడు.

Update: 2023-12-19 13:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. దర్శకధీరుడు తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం తారక్ కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమాలో నటిస్తున్నాడు. ఆ తర్వాత హ‌తిక్ రోషన్‌తో కలిసి వార్-2 మూవీలో నటించబోతున్నాడు. కాగా ఈ హీరో సినీ కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా.. తన కుటుంబానికి మాత్రం తప్పకుండా సమయాన్ని కేటాయిస్తాడు. ఇకపోతే ఎన్టీఆర్ మేనకోడలు వరుసైన లక్ష్మి ప్రణతిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరు భార్గవ్ రామ్‌, అభయ్ రామ్‌ అనే ఇద్దరు కుమారులకు జన్మనిచ్చారు. అయితే వీరి పెళ్లి చూపుల్లో ఎన్టీఆర్.. లక్ష్మి ప్రణతితో మాట్లాడేందుకు ప్రయత్నించినా.. తల దించుకుని సిగ్గుతో ఉన్నదే తప్ప అసలు మాట్లాడలేదట. ఇక పెళ్లి చూపులకు, వివాహానికి మధ్య ఎనిమిది నెలల సమయం ఉందట. ఈ గ్యాప్‌లో ఎప్పుడూ కూడా లక్ష్మీ ప్రణతి తారక్ అంటే ఇష్టం అనే విషయాన్ని చెప్పలేదట.

పెళ్లి తర్వాత కూడా లక్ష్మీ ప్రణతీ సిగ్గుతో.. బిడియంగా ఉండటంతో అసలు నేనంటే నీకు ఇష్టమా.. లేక బలవంతంగా పెళ్లి చేశారా ? అన్న అనుమానం వచ్చి చాలాసార్లు అడిగారట. కొన్నేళ్ల వరకు లక్ష్మీ ప్రణతి అసలు బయటకు కూడా రాలేరట. ఏమైనా ఆడవాళ్ళ ఆలోచనలు అసలు అర్థం కావు.. వాళ్ళ మనసులో ఏమనుకుంటారో బయటపడరు అంటూ తాజాగా ఎన్టీఆర్ సరదాగా చెప్పుకొచ్చారు. ఇక ప్రణతికి 18 ఏళ్లు ఉన్నప్పుడే తారక్‌తో పెళ్లి జరిగింది. వీరిద్దరికి దాదాపు తొమ్మిదేళ్ల ఏజ్ గ్యాప్ ఉంటుంది.

Tags:    

Similar News