సరే చాలు.. ఇప్పుడు నాకు ఆకలిగా ఉంది.. దీపికా పదుకొణె పోస్ట్ వైరల్
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ బ్యూటీ.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెట్టిన ఈ భామ త్వరలోనే తల్లి కాబోతుంది.
దిశ, సినిమా: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ బ్యూటీ.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెట్టిన ఈ భామ త్వరలోనే తల్లి కాబోతుంది. అటూ సినిమాలు చేస్తూనే ఇటు తల్లి కాబోతున్న మధుర క్షణాలను ఆస్వాదిస్తోంది. అంతే కాకుండా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన బేబీ బంప్‌తో ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా దీపికా పదుకొణె బేబీ బంప్‌తో ఫొటోలు షేర్ చేసింది. అంతే కాకుండా.. ‘సరే చాలు.. ఇప్పుడు నాకు ఆకలిగా ఉంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు.
కాగా.. ప్రస్తుతం దీపికా పదుకొణె ప్రస్తుతం ‘కల్కి 2898 AD’ సినిమాతో బిజీగా ఉంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో తెరకెక్కుతుంది. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని కీలక పాత్రలో నటిస్తున్నారు. వైజంతి మూవీ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం జూన్ 27న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.