బ్లౌజ్‌లు వేసుకోకుండా ఉండటమే భారత్ కల్చర్.. సింగర్ చిన్మయి బోల్డ్ కామెంట్స్ (వీడియో)

సింగర్ చిన్మయి పలు చిత్రాల్లో పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Update: 2023-04-30 05:24 GMT

దిశ, వెబ్ డెస్క్: సింగర్ చిన్మయి పలు చిత్రాల్లో పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఎన్నో సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఫుల్ పాపులారిటీని సొంత చేసుకుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు విషయాలపై స్పందిస్తుంటారు. తాజాగా, చిన్మయి భారత సాంప్రదాయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. డ్రెస్‌ల మీద చున్నీలు వేసుకోవడం మానేస్తున్నారని బాధపడిపోతూ ఒక యువకుడు అమ్మాయిలు ఉలాగు వేసుకోవడం లేదు. కాబట్టి నేను వేసుకుంటాను అని చెప్పుకొచ్చిన వీడియోను షేర్ చేశాడు.

ఈ వీడీయో చూసిన చిన్మయి తనదైన శైలిలో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించింది. ‘‘చున్నీలు వేసుకోవాలని చెప్పేవాళ్లు ముందు మన దేశ కల్చర్ ఏంటో తెలుసుకోవాలి. రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నయ్య సత్యేంద్రనాథ్ ఠాగూర్ భార్య జ్ఞానానందిని దేవి ఆడవాళ్లు వేసుకునే జాకెట్ కల్చర్​ను తీసుకొచ్చారు. అప్పటివరకు అసలు జాకెట్లు వేసుకునేవారు కాదు. చీరను జాకెట్​గా మడిచి ధరించేవారు. చున్నీ వేసుకోమని చెప్పే మగవాళ్లు.. షర్ట్, ప్యాంట్లు వదిలి పంచెలు కట్టుకోవాలి జాకెట్ లేకుండా ఉండటం చూసి బ్రిటిషర్లు షాక్ అయ్యారు. స్త్రీలను బ్లౌజ్ లేకుండా చూస్తే వాళ్లకు కలిగిన లైంగిక కోరికల వల్లే భారతీయ మహిళలు జాకెట్లు వేసుకోవడం మొదలుపెట్టారు. మీ అమ్మమ్మలు, నాన్నమ్మలు బ్లౌజ్ వేసుకునేవారు కాదు. బ్లౌజ్ వేసుకోవడం మన భారతీయ కల్చర్ కాదు. విజ్ఞానం పెంచుకోవాలి, కామంతో ప్రతిదాన్ని చూడొద్దని చిన్మయి చెప్పకొచ్చిన వీడియోను షేర్ చేశారు.

Tags:    

Similar News