Varuntej and Lavanya Tripathi: దాన్ని మాత్రం వదులుకోను అంటూ వరుణ్ తేజ్‌కి తెగేసి చెప్పిన లావణ్య త్రిపాఠి
గత పది రోజుల నుంచి వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పేర్లు సోషల్ మీడియాలో మారుమోగుతున్నాయి.
దిశ, సినిమా: గత పది రోజుల నుంచి వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పేర్లు సోషల్ మీడియాలో మారుమోగుతున్నాయి. ఇక జూన్ 9న అంగరంగ వైభవంగా వీరిద్దరి నిశ్చితార్థం కూడా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకోవడం కోసం తనకు చాలా కండిషన్స్ పెట్టారట. ‘సినిమాలకు దూరంగా ఉంటూ, మన కుటుంబానికి ఎలాంటి మచ్చ రాకుండా చూసుకోవాలి’ అని మాట తీసుకున్నాడట. దీనికి ఒప్పుకున్న లావణ్య తిరిగి వరుణ్‌కి కూడా కండిషన్ పెటిందట. ‘మూవీస్ కాదు కానీ నాకు భరతనాట్యం అంటే ఎంతో ఇష్టం. స్టేజ్‌పై ప్రదర్శించే అవకాశం వస్తే నేను కచ్చితంగా వెళ్తా. మీరు అడ్డు చెప్పకూడదు’ అంటూ ప్రామిస్ చేయించుకుందట లావణ్య.