ఇక నో ఐటెమ్ సాంగ్స్‌.. కీలక నిర్ణయం తీసుకున్న స్టార్ హీరోయిన్!

కథానాయిక త్రిషకు ఐటెమ్‌సాంగ్స్‌ ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయట.

Update: 2024-09-18 13:53 GMT

దిశ, సినిమా: కథానాయిక త్రిషకు ఐటెమ్‌సాంగ్స్‌ ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయట. ఇటీవల ఆమె విజయ్‌ హీరోగా రూపొందిన గోట్‌ చిత్రంలో ఓ ప్రత్యేక పాటలో కనిపించడమే అందుకు కారణం. అయితే గోట్‌లో తను చేసిన పాటను త్రిష మాత్రం ఐటెమ్‌ సాంగ్‌గా పరిగణించటం లేదట. సినిమాలో అదొక అతిథి పాత్రలో కనిపించడమే అని ఆమె చెబుతున్నారు. ప్రస్తుతానికి తెలుగు, తమిళ భాషల్లో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆమె ఇక నుంచి ప్రత్యేక పాటల్లో నర్తించకూడదని నిర్ణయం తీసుకున్నారట.

గోట్‌ చిత్రంలో కూడా హీరో విజయ్‌కు ఆమెకు ఉన్న ఫ్రెండ్‌షిప్‌ కారణంగానే ఒప్పుకున్నారట. అవకాశాలు వస్తున్నాయని, పారితోషికం కోసమని ఐటెమ్‌ సాంగ్స్‌లో నటించి ఆ జోన్‌లోకి వెళ్లకూడదని త్రిష డిసైడ్‌ అయ్యారట. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంతో పాటు పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న కమల్‌హాసన్‌-మణిరత్నం చిత్రం థగ్‌లైఫ్‌లో కూడా త్రిష కథానాయికగా నటిస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని బిగ్‌ ప్రాజెక్టులకు ఆమె ఓకే చెప్పారని సమాచారం.

Read More..

ప్రభాస్‌కు జోడీగా సమంత.. సినిమా టైటిల్ కూడా ఫిక్స్? 


Similar News