అలాంటి పని చేయబోతున్న నిహారిక.. స్పెషల్ అట్రాక్షన్‌గా వరుణ్-లావణ్య!
ఇప్పటి వరకు మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కే పరిమితమైంది.
దిశ, వెబ్‌డెస్క్: ఇప్పటి వరకు మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కే పరిమితమైంది. ఇప్పుడామె మరో స్టెప్ తీసుకుని.. ఫీచర్ ఫిల్మ్‌తో వెండితెరకు నిర్మాతగా పరిచయం కాబోతోంది. శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్‌తో కలిసి తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి.పై ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్‌ని నిహారిక నిర్మించబోతోంది. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు శుక్రవారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగాయి. ఈ కార్యక్రమానికి మెగా హీరో వరుణ్ తేజ్-లావణ్య పెళ్లయిన తర్వాత మొట్టమొదటిసారిగా కెమెరాకు కనిపించారు. నిహారిక కొణిదెల సమర్పణలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా తదితరులు నటీనటులుగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, బ్యానర్స్‌పై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న చిత్ర పూజా కార్యక్రమాలు శుక్రవారం హైదరాబాద్‌లో జరిగాయి.
ముహూర్తపు సన్నివేశానికి హీరో వరుణ్ తేజ్ క్లాప్ కొట్టగా.. నాగబాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి సన్నివేశాన్ని దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించనున్నారు. నిర్మాత అల్లు అరవింద్, స్క్రిప్ట్‌ని నిహారిక కొణిదెల, డైరెక్టర్ యదు వంశీ సహీ చిత్ర యూనిట్ సభ్యులకు అందించారు. అనంతరం నిహారిక మాట్లాడుతూ.. మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఇప్పటి వరకు వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిలింస్ మాత్రమే చేస్తూ వచ్చాము. తొలిసారి ఫీచర్ ఫిల్మ్ స్టార్ట్ చేశాం. మాతో పాటు శ్రారాధా దామోదర్ స్టూడియోస్ వారు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. సేమ్ టైమ్ టెన్షన్‌గానూ ఉంది. ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా. ఇంత మంది కొత్త వాళ్లతో సినిమా చేయడం పెద్ద బాధ్యతగా భావిస్తున్నా’’ అంటూ చెప్పుకొచ్చింది.