Niharika Konidela :మెగా ఫ్యామిలీకి ఇష్టం లేకున్నా, విడాకుల తర్వాత ఆ పని చేయడానికి రెడీ అయిన నిహారిక
మెగాడాటర్ నిహారిక జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకొని , రెండేళ్లు కూడా కాపురం చేయకుండానే విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరి అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నాం అని నిహారిక, చైతన్య అఫిషియల్‌గా
దిశ, వెబ్‌డెస్క్ : మెగాడాటర్ నిహారిక జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకొని , రెండేళ్లు కూడా కాపురం చేయకుండానే విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరి అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నాం అని నిహారిక, చైతన్య అఫిషియల్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక విడాకుల తర్వాత నిహారిక తన పర్సనల్ లైఫ్ తన ఇష్టం అన్నట్లు బిహేవ్ చేస్తుంది. కాగా, తాజాగా ఆమె కెరీర్ పరంగా డేరింగ్ స్టెప్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
విడాకుల తర్వాత అచ్చం సమంత లాగే తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే పెట్టేసింది నిహారిక. పలు వెబ్ సిరీసులు చేస్తూ నిర్మాతగా కూడా రాణించాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీకి ఇష్టం లేకున్నా, హీరోయిన్గా మళ్లీ తెరపైకి రావాలని ఫిక్స్ అయ్యిందంట. ఈ మెరకు ఓ డైరెక్టర్‌తో కలిసి మూవీ చేసేందుకు రెడీ అయ్యిందని సమాచారం