NIHARIKA: కమెడియన్‌తో రొమాన్స్‌కు సిద్ధమైన నిహారిక.. షాక్‌లో ఫ్యాన్స్!

టాలీవుడ్ కమెడియన్ ప్రియదర్శి పులికొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Update: 2024-08-04 10:43 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ కమెడియన్ ప్రియదర్శి పులికొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. 2016 లో తెరకెక్కిన ‘పెళ్లి చూపులు’ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తన కమెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. తర్వాత అర్జున్ రెడ్డి, జాతిరత్నాలు, మల్లేశం,మంగళవారం, ఓం భీమ్ బుష్, నాంది, వరల్డ్ ఫేమస్ లవర్,మిస్టర్ మజ్ను, F2 – ఫన్ అండ్ ఫ్రస్టేషన్, మిడిల్ క్లాస్ అబ్బాయి, మిస్టర్ వంటి మూవీల్లో అద్భుతంగా నటించాడు. ఇక బలగం సినిమాలో ముఖ్యపాత్రలో నటించి ఇండస్ట్రీలో మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నాడు.

తొలుత కమెడియన్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం హీరో క్యారెక్టర్‌లో నటించే స్థాయికెళ్లిన ప్రియదర్శి సేవ్ ద టైగర్స్ అనే వెబ్ సిరీస్ కు కూడా తీశాడు. ఇకపోతే ఈ హీరో ప్రస్తుతం మంచి కంటెంట్ ఉన్న మరో సినిమాతో ప్రక్షకుల మందుకు రాబోతున్నాడు. కాగా ప్రియదర్శి సరసన తమిళనాడుకు చెందిన ఎన్. ఎమ్. నిహారిక అనే అమ్మాయిని హీరోయిన్‌గా తీసుకోబోతున్నాట దర్శక, నిర్మాతలు. ఈ బ్యూటీ యూఎస్‌లో చదువుకుంటోన్న టైంలోనే సోషల్ మీడియాలో పలు వీడియోలు చేస్తూ ఫేమ్ అయ్యింది.

దీంతో సూపర్ స్టార్ మహేష్ బాబు, కేజీఎఫ్ చిత్రంలో అవకాశం కొట్టేసింది. సైడ్ క్యారెక్టర్ గా మెరిసిన నిహారిక ప్రస్తుతం కథానాయికగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఈ వార్త నెటిజన్లు షాక్ కు గురవుతున్నారు. ఇక్కడ తెలుగు వారు ఎన్నో ఏళ్ల నుంచి ట్రై చేస్తున్నా అవకాశాలు రావట్లేదు.. ఎక్కడో అమెరికాలో ఉండి డైరెక్ట్ అగ్ర హీరోల సినిమాల్లో అవకాశాలు కొట్టేస్తున్నావంటూ నిహారికపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 

Tags:    

Similar News