Niharika Konidela: వరద బాధితులకు విరాళం ప్రకటించి ట్రోల్స్ ఎదుర్కొంటున్న నిహారిక.. అసలేం జరిగిందంటే?

తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయిన విషయం తెలిసిందే.

Update: 2024-09-07 09:18 GMT

దిశ, సినిమా: తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఏపీలో విజయవాడ, తెలంగాణలో ఖమ్మంలో పలు ప్రాంతాలు నీట మునిగి ప్రజలను ఇబ్బందులకు గురి చేశాయి. అయితే చాలామంది ఆహారం, నీరు అందక నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టి బాధితులను ఆదుకుంటోంది. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ స్టార్స్ తమ వంతుగా కొంత డబ్బును సీఎం సహాయనిధికి అందజేశారు. ఈ క్రమంలో మెగా డాటర్ నిహారిక కూడా విరాళం ఇచ్చింది.

‘‘విజయవాడలోని రూరల్ ఏరియాలో అనేక గ్రామాలు నీట మునగడం, ప్రజలు ఇబ్బందులు పడుతుండడం నాకు చాలా బాధ కలిగించింది. ఇటువంటి ప్రకృతి విపత్తులో ఎక్కువగా ఇబ్బందులు పడేది గ్రామీణ ప్రాంత ప్రజలే. నేను పుట్టి పెరిగిన వాతావరణం అంతా నగరంలోనే అయినా మా పెద్దవారు అందరూ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవారు కాబట్టి వారు చెప్పే అనుభవాలు విన్న దృష్టా నాకు గ్రామీణ వాతావరణంపై ఎంతో అభిమానం ఉంది. ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మా బాబాయ్ పవన్ కల్యాణ్ తో పాటు మా కుటుంబీకులు అందరూ బాధితులకు అండగా నిలబడటం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది.

నేను కూడా వరద ముంపుకు గురైన ఒక పది గ్రామాలకు ఒక్కో గ్రామానికి ఏభై వేలు చొప్పున ఐదు లక్షలు విరాళంగా ఇవ్వాలనుకుంటున్నాను’’ అని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ప్రజెంట్ ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. నిహారికను ట్రోల్ చేస్తున్నారు. అలాగే కొంతమంది మీరు ఉంటున్న రాష్ట్రం సంగతి ఎం కావాలి? తెలంగాణలో కూడా వరదలు వచ్చాయి. ఇదేం అన్యాయం చేసింది. ఇక్కడ ఉంటూ ఇలా మాట్లాడటం తప్పు అని కామెంట్లు పెడుతున్నారు.

 


Similar News