Devara Movie: ఆచార్య పాద ఘట్టం.. దేవర సముద్ర మట్టం అంటూ ట్రోల్స్ చేస్తున్న నెటిజెన్స్.. మరి సినిమా హిట్ కొడుతుందా?

ఆచార్య పాద ఘట్టం.. దేవర సముద్ర మట్టం అంటూ ట్రోల్స్ చేస్తున్న నెటిజెన్స్

Update: 2024-09-14 04:28 GMT

దిశ, వెబ్ డెస్క్ : కొరటాల శివ డైరెక్షన్లో హీరోగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర. ఈ సినిమా కోసం కేవలం అభిమానులు కాకూండా సినీ ఇండస్ట్రీ మొత్తం వేచి చూస్తున్నారు. మొన్న రిలీజ్ అయినా ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ రావడంతో అప్పటి వరకు అంచనాలు కాస్తా అమాంతం పెరిగిపోయాయి. ఆచార్యతో ఫ్లాప్ అందుకున్న డైరెక్టర్ ఈ సినిమాతో పెద్ద హిట్ కొట్టి మళ్లీ తన సక్సెస్ ట్రాక్ లోకి వెళ్ళాలని చాలా కష్టపడి తెరకెక్కించాడు. దేవర మూవీ దేశ వ్యాప్తంగా ఈ నెల 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రస్తుతం ఈ మూవీలో నటించిన వారందరూ ప్రమోషన్లలో ఫుల్ బిజీ అయ్యారు. ఇక సినిమాలో నటించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అయితే గ్యాప్ లేకుండా మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. మాస్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.

అయితే, ఈ సినిమాకి ఎంత హైప్ వచ్చిందో.. అదే విధంగా ట్రోల్స్ కూడా చేస్తున్నారు.. ఇన్ని కోట్లు పెడుతున్నారు.. మరి కలెక్ట్ చేస్తుందా.. ఆచార్య మూవీ కి  కూడా అంత భారీ బడ్జెట్ పెట్టారు.. కానీ, ఫ్లాప్ అయింది.. ఇప్పుడు దేవర ఫ్లాప్ అవ్వదని శివ కొరటాల అభిమానులకు మాట ఇవ్వగలడా.. అప్పుడేమో ఆచార్య పాద ఘట్టం ఇప్పుడేమో దేవర సముద్ర మట్టం అంటూ పేర్లు పెట్టి ట్రోల్స్ చేస్తున్నారు. మరి, ఈ సినిమా హిట్ అయి ఇద్దరికీ మంచి పేరు తెస్తుందో? లేదో చూడాలి..!

Read more : దేవర బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలి..!

Tags:    

Similar News