Taapsee Pannu: నీకు అంత పొగరు పనికిరాదు శిక్షణ చాలా అవసరం.. స్టార్ హీరోయిన్‌పై నెటిజన్లు ఫైర్
డార్లింగ్ ప్రభాస్ ‘Mr. పర్ఫెక్ట్’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ పన్ను.. తర్వాత బాలీవుడ్ చెక్కేసింది.
దిశ, సినిమా: డార్లింగ్ ప్రభాస్ ‘Mr. పర్ఫెక్ట్’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ పన్ను.. తర్వాత బాలీవుడ్ చెక్కేసింది. ప్రజెంట్ అక్కడ వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా దూసుకుపోతుంది. అయితే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తాప్సీ.. ఏదున్న డైరెక్ట్‌గా మాట్లాడేస్తూ.. చెయ్యాలి అనుకున్నది చేసేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. అవి కొన్నిసార్లు వివాదాలకు దారితీస్తాయి. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి వివాదంలో చిక్కుకుంది తాప్సీ.
తాప్సీ పన్ను నటిస్తున్న తాజా చిత్రం ‘ఖేల్ ఖేల్ మే’. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ మూవీకి సంబంధించి పాటల రిలీజ్ కార్యక్రమాన్ని ముంబైలో నిర్వహించారు చిత్రం బృందం. ఈ ఈవెంట్‌కు కొంత మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌ను కూడా ఆహ్వానించారు. ఈ క్రమంలోనే అక్కడకు వచ్చిన అనన్య ద్వివేది అనే యువతి తాప్సీ వద్దకు వెళ్లి సెల్ఫీ కోరింది. అయితే.. అందుకు తాప్సీ నిరాకరించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రజెంట్ నెట్టింట వైరల్‌గా మారడంతో.. తాప్సీపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
ఇంత పొగరు పనికిరాదంటూ కొందరు విమర్శిస్తున్నారు. అయితే ఈ ఇష్యూపై అనన్య ద్వివేది స్పందిస్తూ.. ‘‘ఈ వీడియోలో ఉన్నది నేనే. అక్కడ చాలా కెమెరాలు ఆమెను ఫోటో తీస్తున్నా కూడా నన్ను సెల్ఫీ తీసుకోవద్దు అని ఆమె ఎందుకు అన్నారో అర్థం కావడం లేదు. తన పాటను ప్రమోట్ చేయడానికి మమ్మల్ని ఆహ్వానించారు. తాప్సీ పన్నుకు నిజంగా మంచి పీఆర్ శిక్షణ అవసరం’ అంటూ కామెంట్ చేసింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా నెట్టింట వైరల్‌గా మారాయి. మరి దీనిపై తాప్సీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.