‘రోడీస్’లో పాల్గొన్న ఫస్ట్ ట్రాన్స్ ఉమెన్‌గా నీర్జా.. బిచ్చగాళ్లుగా చూస్తున్నారంటూ ఆవేదన

నీర్జా ఈ షోలో తమ జెండర్ ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరంగా మాట్లాడింది

Update: 2023-06-14 09:19 GMT

దిశ, సినిమా: యూత్ బేస్డ్ రియాలిటీ షో ‘రోడీస్’లో పాల్గొన్న మొదటి ట్రాన్స్ ఉమెన్‌ కంటెస్టెంట్‌గా నిలిచించి ప్రముఖ మోడల్ నీర్జా పునియా. హర్యానాకు చెందిన నీర్జా ఈ షోలో తమ జెండర్ ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరంగా మాట్లాడింది. తమ రాష్ట్రంలో ట్రాన్స్ కమ్యూనిటీని యాచకులుగా పరిగణిస్తున్నారని, విద్యా విధానం సరిగా లేకపోవడం వల్లే సమాజంలో ట్రాన్స్‌జెండర్ గురించి అవగాహన లేదని వాపోయింది. అలాగే తమకు ఏ రంగాల్లో అవకాశాలు కల్పించట్లేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆమె.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తమ కమ్యూనిటీ గురించి అవగాహన కల్పించేందుకు విభిన్న ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. MTV రోడీస్ అనే కార్యక్రమం యువత-ఆధారిత రియాలిటీ షో. MTV, Jio సినిమాల్లో ప్రతి శని, ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రసారం అవుతుంది.


Similar News