ఎన్.బీ.కే 108: భారీ సెట్ లో సాంగ్ షూట్ పూర్తి

షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది నిర్మాతగా, హిట్ సినిమాల డైరెక్టర్ అనిల్ రావిపూడి, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ వస్తున్న సినిమాకి ఇంక టైటిల్ ఫిక్స్ కాలేదు.

Update: 2023-04-08 14:35 GMT

దిశ, వెబ్ డెస్క్: షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది నిర్మాతగా, హిట్ సినిమాల డైరెక్టర్ అనిల్ రావిపూడి, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ వస్తున్న సినిమాకి ఇంక టైటిల్ ఫిక్స్ కాలేదు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కు తాత్కాలికంగా 'ఎన్.బీ.కే 108' అనే టైటిల్ తో హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ సినిమాని చిత్ర నిర్మాతలు విజయదశమికి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఫిల్మ్ నగర్ తాజా అప్ డేట్ ప్రకారం.. బాలకృష్ణ నటించిన ఎనర్జిటిక్ సాంగ్ షూట్ పూర్తయినట్లు సమాచారం. భారీ సెట్ తో చిత్రీకరించిన ఈ సాంగ్ కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ సాంగ్ చిత్రానికే హైలైట్ గా నిలవనుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. చిత్రంలో కాజల్ అగర్వాల్ ప్రధాన కథానాయికగా నటిస్తుండగా, శ్రీ లీల కీలక పాత్ర పోషిస్తోంది.

ఇవి కూడా చదవండి: విడుదల పార్ట్1’.. తెలుగు వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్

Tags:    

Similar News