ఆస్తులన్నీ మళ్లీ తన పేరు మీదకు మార్చుకున్న నయనతార.. కారణం అదేనా?

తాజాగా లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది

Update: 2024-04-01 03:49 GMT

దిశ, సినిమా: తాజాగా లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ బ్యూటీ తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ ను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వివాహనంతరం భర్త మీదున్న ప్రేమతో నయన్ తన ఆస్తులన్నీ విఘ్నేష్ పేరు మీదకు మార్చేసిందట. పెళ్లి తర్వాత భర్తే తన సర్వస్వం అని భావించి.. ఈ నిర్ణయం తీసుకున్న నయనతార ఇప్పుడు ఆస్తులన్నీ మళ్లీ తన పేరు మీదకు మార్చేసిందట. కారణం ఏంటో తెలియదు కానీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం హాట్ టాపిక్ గా మారింది.

అసలు ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియనప్పటికీ ఇటీవల నయనతార-విఘ్నేష్ విడాకులు తీసుకోబోతున్నారని, వేణుస్వామి చెప్పిందే నిజమయ్యేలా ఉందని నెట్టింట జనాలు తెగ చర్చించుకున్నారు. వీరిద్దరి మధ్య సమ్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయని.. అందుకే ఈ మధ్య నయన్-విఘ్నేష్ ఇలా బిహేవ్ చేస్తున్నారని ఫ్యాన్స్ రకరకాల అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ పుకార్లన్నింటికి నయన్ ఓ పోస్ట్ తో క్లారిటీ ఇచ్చింది. నాలుగు రోజులు గడవక ముందే.. ఆ పుకార్లకు బలానిచ్చేలా ఇప్పుడు నయన్ తన భర్త పేరు మీదున్న ఆస్తులన్నీ తన పేరు మీదకు మార్చేస్తుందని మరో వార్త నెట్టింట హల్ చల్ చేస్తుంది.


Similar News