Nayaanthara: ఇకపై నటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా.. స్టార్ హీరోయిన్
డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో వివాహ బంధంలోకి అడుగు పెట్టిన నయన్.. ఇటీవలే కవలలు జన్మనిచ్చారు.
దిశ, సినిమా: నయనతార గురించి పరిచయం అవసరం లేదు. తెలుగుతోపాటు తమిళంలోనూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి, తక్కువ సమయంలోనే లేడీ సూపర్ స్టార్‌గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో వివాహ బంధంలోకి అడుగు పెట్టిన నయన్.. ఇటీవలే కవలలు జన్మనిచ్చారు. ఇకపోతే వరుస చిత్రాలతో ఎప్పుడూ బిజీగా ఉండే నయన్ తాజాగా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. కొంతకాలంపాటు నటనకు దూరంగా ఉండాలని, తన సొంత నిర్మాణ సంస్థపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంట. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న సినిమాలు మాత్రమే పూర్తి చేసి, ఇకపై నటించడం మానేయ్యాలనుకుంటుందట. దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.