నయనతారకు ఎఫైర్స్ లేవా.. నాకుంటే తప్పేంటి: శ్రీరెడ్డి సంచలన కామెంట్స్
తరచూ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులపై కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది శ్రీరెడ్డి.
దిశ, వెబ్‌డెస్క్: తరచూ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులపై కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది శ్రీరెడ్డి. ఎవరేమనుకున్నా సరే తనకు నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతూ వివాదాల్లో చిక్కుకుంటుంది. తాజాగా ఈ బోల్డ్ నటి.. నయనతారతో పోల్చుకుంటూ, నెటిజన్లకు సమాధానం ఇచ్చింది. అయితే ఈ మధ్యన శ్రీరెడ్డి అందరిపై ఆరోపణలు చేయడంతో నెటిజన్లు.. నీకే ఎఫైర్లు ఉన్నాయి. అలాంటి నువ్వు నీతులు చెప్పడం ఏంటి?’ అని కొంతమంది విమర్శించారు. దీంతో శ్రీరెడ్డి.. ‘నా సెక్స్‌వల్ లైఫ్ గురించి మాట్లాడానికి మీరెవరు.
స్టార్ హీరోయిన్లను ఎవరైనా ఇలాంటి ప్రశ్నలు వేస్తారా? నన్నే ఎందుకు అడుగుతున్నారు. హీరోయిన్ నయనతారకు ఎఫైర్స్ లేవా? ఆమె పెళ్లైనా నటులతో డేటింగ్ చేసింది. అప్పుడు ఆమెను ఎవరైనా అడిగారా? ఇప్పుడు నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. స్టార్ హీరోయిన్ను అయితే అడగలేరు కానీ నాలాంటి చిన్న ఆర్టిస్టులను మాత్రం ఆడేసుకుంటున్నారు.’’ అంటూ శ్రీరెడ్డి నెటిజన్లపై మండిపడుతూ వ్యాఖ్యలు చేసింది. దీంతో నయనతార ఫ్యాన్స్ శ్రీరెడ్డిపై ఫైర్ అవుతూ.. ‘నీకు అంత గొప్ప హీరోయిన్‌తో పోలికేంటి అస్సలు..?’ అని దారుణంగా తిట్టిపోస్తున్నారు.