పీరియడ్స్ గురించి తాతతో ఓపెన్‌గా డిస్కస్ చేస్తా.. బిగ్ బీ మనవరాలు
బాలీవుడ్ స్టార్ కిడ్ నవ్యా నవేలి నందా.. తన పర్సనల్ విషయాలన్నీ ఇంట్లో వాళ్లతో ఓపెన్‌గా చర్చిస్తానంటోంది. అంతేకాదు తన తాత అమితాబ్ బచ్చన్‌తో ప్రతినెల వచ్చే మహిళల పీరియడ్స్ గురించి బహిరంగంగానే డిస్కస్ చేస్తానంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.. Latest Telugu News
దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ కిడ్ నవ్యా నవేలి నందా.. తన పర్సనల్ విషయాలన్నీ ఇంట్లో వాళ్లతో ఓపెన్‌గా చర్చిస్తానంటోంది. అంతేకాదు తన తాత అమితాబ్ బచ్చన్‌తో ప్రతినెల వచ్చే మహిళల పీరియడ్స్ గురించి బహిరంగంగానే డిస్కస్ చేస్తానంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. బిగ్ బీతో తనకున్న సన్నిహిత బంధం గురించి మాట్లాడుతూ.. తాత సమక్షంలో బహిరంగ వేదికపై రుతుక్రమం గురించి చర్చించడం ప్రగతికి నిదర్శనమని చెప్పింది. అలాగే ఈ రోజుల్లో యుక్తవయస్సులో ఉన్నవారు తమ తల్లిదండ్రులతో ఆరోగ్యానికి సంబంధించి, ముఖ్యంగా ఇలాంటి విషయాల గురించి చర్చించడం అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారన్న నవ్య.. 'తాత చెప్పినట్లుగా ఇది జీవితానికి సంకేతం. మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అలాంటి విషయం కూడా కాదు. అయితే చాలా కాలంగా ఋతుస్రావం అనే పదం బహిరంగంగా నిషేధించబడింది. కానీ, కాలక్రమంలో ఈ విషయంలో చాలా మార్పులు వచ్చాయి. నేను ఈ రోజు వేదికపై కూర్చుని తాతతో పీరియడ్స్ గురించి మాట్లాడుతున్నా. అదే పురోగతికి సంకేతం. రుతుక్రమం గురించి బహిరంగంగా మాట్లాడుకోవడంమంటే స్త్రీ అభివృద్ధికి సంకేతమని అర్థం చేసుకోవాలి' అంటూ తన అభిప్రాయాలను వెల్లడించింది.
ALSO READ : బటన్‌లెస్ టాప్‌తో ఎద అందాల కవ్వింత