మంత్రి మల్లారెడ్డి ఫేమస్ డైలాగ్‌తో స్పీచ్ ఇచ్చి అదరకొట్టిన నవీన్ పొలిశెట్టి.. వీడియో వైరల్
‘జాతిరత్నాలు’ చిత్రంతో ఒక్కసారిగా స్టార్‌గా మారిపోయిన నవీన్ పొలిశెట్టి.. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టితో కలిసి ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా చేస్తున్నారు.
దిశ, సినిమా: ‘జాతిరత్నాలు’ చిత్రంతో ఒక్కసారిగా స్టార్‌గా మారిపోయిన నవీన్ పొలిశెట్టి.. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టితో కలిసి ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా చేస్తున్నారు. మహేష్ బాబు.పి దర్శకత్వంలో తెరక్కెకిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా ఆగస్ట్ 4న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. దీంతో ప్రస్తుతం ప్రమోషన్స్‌తో చిత్రయూనిట్ బిజీగా ఉంది. ముఖ్యంగా నవీన్ పోలిశెట్టి చాలా కష్టపడుతున్నాడు. తనదైన స్టైల్లో యూత్‌ను అట్రాక్ట్ చేస్తున్నాడు.
ఇందులో భాగంగా తాజాగా మంత్రి మల్లారెడ్డి CMR కాలేజ్‌కు వెళ్లి అక్కడి స్టూడెంట్స్‌ని హూషారెత్తించాడు. మల్లారెడ్డి ఫేమస్ డైలాగ్‌తో స్పీచ్ అదరగొట్టాడు. ‘కష్ట పడ్డా. ఇన్ని హిట్లు ఏడికెళ్ళి వచ్చినయి. ఎట్లచ్చినయి. నేనేమైన మాయజేసిన్నా. మంత్రం జేసిన్నా. కష్ట పడ్డా. స్కిట్లు రాసినా. యూట్యూబ్‌లో వీడియోలు జేసినా. అనుష్కతో హీరోగా జేసినా... సక్సెస్ అయినా..’ అంటూ తెలంగాణ యాసలో స్పీచ్ ఇచ్చాడు. దీంతో స్టూడెంట్స్ అందరూ నవీన్‌కు ఫిదా అయ్యారు.