పెళ్లి వద్దు.. ప్రేమిస్తే చాలు: మగాళ్ల వెంటపడుతున్న Nargis Fakhri

అమెరికన్ హాట్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ 43వ పడిలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా పుట్టిన రోజు వేడుకలను సన్నిహితులతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్న నటి.. ఓ చానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కెరీర్, డేటింగ్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

Update: 2022-10-20 12:44 GMT

దిశ, సినిమా: అమెరికన్ హాట్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ 43వ పడిలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా పుట్టిన రోజు వేడుకలను సన్నిహితులతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్న నటి.. ఓ చానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కెరీర్, డేటింగ్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకముందే తాను కలుసుకున్న మగవాళ్లందరూ తనను చూసి భయపడ్డారని, డేటింగ్ చేయడం అసురక్షితంగా భావించి ఎవరూ తనను ప్రేమించేందుకు ధైర్యం చేయలేదని తెలిపింది.

దీంతో మానసికంగా ఎంతో వేదనకు గురయ్యానన్న ఆమె.. ఇకపై బయట వ్యక్తులను కాకుండా ఇండస్ట్రీకి చెందినవాళ్లనే లవ్ చేయాలని ఫిక్స్ అయినట్లు చెప్పింది. ఈ క్రమంలోనే 5ఏళ్లుగా ఉదయ్ చోప్రాతో డేటింగ్ చేసినట్లు తెలిపింది. ఇక తన సంస్కృతి ప్రకారం వివాహం చేసుకోవాల్సిన అవసరం లేదని, కేవలం ఒక పురుషుడితో సంబంధాన్ని కలిగివుండటమే ముఖ్యంగా భావిస్తానన్న నర్గీస్.. ఆ అవకాశం తనకు లభించకపోవడంతో ఒంటరిగానే ఉండాలనుకున్నట్లు చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చ‌ద‌వండి

1.సోదరికి జాన్వీ డేటింగ్ అడ్వైజ్.. వాళ్లతో జాగ్రత్త అంటూ 

Tags:    

Similar News