నరేష్‌ను ఇప్పుడు ఏ చెప్పుతో కొట్టాలి..? సహజీవనంపై సామాజిక కార్యకర్త ఫైర్ (వీడియో)

రెండో పెళ్లి చేసుకోవడం తప్పు కాదు.. కానీ మొదటి భాగస్వామికి విడాకులు ఇవ్వకుండా మరో పెళ్లి చేసుకోవడం తప్పే అని సామాజిక కార్యకర్త కృష్ణకుమారి అన్నారు.

Update: 2023-06-14 12:27 GMT

దిశ, వెబ్‌డెస్క్ : రెండో పెళ్లి చేసుకోవడం తప్పు కాదు.. కానీ మొదటి భాగస్వామికి విడాకులు ఇవ్వకుండా మరో పెళ్లి చేసుకోవడం తప్పే అని సామాజిక కార్యకర్త కృష్ణకుమారి అన్నారు. కానీ సుప్రీం కోర్టు తీర్పును అడ్డుపెట్టుకుని సహజీవనం చేయడం తప్పుకాదు అని కొందరు భాగస్వామికి విడాకులు ఇవ్వకుండానే మరొకరితో లీగల్‌గా అక్రమ సంబంధం పెట్టుకోవడం ఎంత వరకు సబబు అని ఆమె ప్రశ్నించారు. నరేష్, పవిత్ర లోకేష్ పెళ్లి కూడా ఇలాగే ఉందని కృష్ణకుమారి మండిపడ్డారు. ఇలా ఒక్కొక్కరు ఇలా మూడు, నాలుగు పెళ్లిలు చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు.

నరేష్‌ది బాధ్యత రహిత్యమని, భార్య ఉండగానే మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోని బహిరంగంగా లిఫ్ కిస్ పెట్టుకున్నాడని ఫైర్ అయ్యారు. నరేష్, పవిత్ర లోకేష్ తమ అనైతిక బంధాన్ని తెర మీద చూపించి, తమ సహజీవనాన్ని బట్టబయలు చేసుకున్నారని తెలిపారు. అలాగే నరేష్ వ్యవహారశైలి, పవిత్రపై సంచలన కామెంట్స్ చేశారు. ఇలా మహిళల జీవితాలతో ఆడుకున్న నరేశ్‌ను ఏ చెప్పుతో కొట్టాలని కృష్ణకుమారి ప్రశ్నించారు. ‘మళ్లీ పెళ్లి’ సినిమా, వారిద్దరి సహజీవనంపై కృష్ణకుమారి పలు ఆసక్తికర విషయాలను ‘దిశ టీవీ’తో పంచుకున్నారు. కృష్ణకుమారి పూర్తి ఇంటర్వ్యూ కోసం కింది లింక్‌ను క్లిక్ చేయండి.

Also Read:   పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ సినిమా.. 



Tags:    

Similar News