Tarakaratna: తారకరత్న అవయవాలన్నీ పనిచేస్తున్నాయి: నందమూరి రామకృష్ణ కీలక అప్డేట్

నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై నందమూరి రామకృష్ణ అప్డేట్ ఇచ్చారు.

Update: 2023-01-30 10:33 GMT
Tarakaratna: తారకరత్న అవయవాలన్నీ పనిచేస్తున్నాయి: నందమూరి రామకృష్ణ కీలక అప్డేట్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై నందమూరి రామకృష్ణ అప్డేట్ ఇచ్చారు. మొన్నటి కంటే ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం కాస్త మెరుగుపడిందని తెలిపారు. అవయవాలన్నీ బాగానే పనిచేస్తున్నాయని.. చికిత్సకు స్పందిస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం తారకరత్న న్యూరాలజిస్ట్ అబ్జర్వేషన్‌లో వెంటిలేటర్‌పై ఉన్నారని తెలిపారు. తారకరత్నకు ఎక్మో పెట్టలేదు.. ఎక్మో ద్వారా చికిత్స అందిస్తున్నారనేది అవాస్తవమని అన్నారు. సిటీ స్కా్న్ రిపోర్ట్ వచ్చాక బ్రెయిన్ పనితీరుపై క్లారిటీ వస్తుందని వెల్లడించారు. తారకరత్న స్వయంగా కొంత ఆక్సిజన్ తీసుకుంటున్నాడని చెప్పారు. కాగా, ఈ నెల 27వ తేదీన టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండె పోటుకు గురై తీవ్ర అస్వస్థతకు గురిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తారకరత్న బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

READ MORE

'మైఖేల్' ప్రీరిలీజ్ ఈవెంట్‌ గెస్ట్‌గా నేచురల్ స్టార్ 

Tags:    

Similar News