IPL 2023.. కామెంటేటర్‌గా వ్యవహరించనున్న బాలయ్య
నందమూరి బాలయ్య వరుస చిత్రాలతో దూసుకుపోతునే, పలు షోలలో వ్యాఖ్యాతగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.
దిశ, సినిమా: నందమూరి బాలయ్య వరుస చిత్రాలతో దూసుకుపోతునే, పలు షోలలో వ్యాఖ్యాతగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. తాజా సమాచారం ప్రకారం మార్చి 31న ప్రారంభంకానున్న IPL ఓపెనింగ్సెర్మనీలో బాలయ్య సందడి చేయనున్నారు. చెన్నై సూపర్ కింగ్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనున్న తొలి ఐపీఎల్ మ్యాచ్‌కు ఆయన కామెంటేటర్‌గా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని స్టార్‌స్పోర్ట్స్ సంస్థ వెల్లడించింది. దీకిని సంబంధించిన వీడియోలో బాలయ్య బాబు తన చిన్ననాటి సంఘటనలు గుర్తు చేసుకున్నారు. ‘నాకు నటన మాత్రమే కాదు.. ఈ ఆట అంటే స్కూల్ డేస్ నుంచి చాలా ఇష్టం. ఇన్నాళ్లకు కామెంటేటర్‌గా రావడం చాలా సంతృప్తినిస్తుంది’ అని బాలయ్య చెప్పుకొచ్చాడు.
ఇన్క్రెడిబుల్ ప్రీమియర్ లీగ్😎
— StarSportsTelugu (@StarSportsTel) March 26, 2023
ఓపెనింగ్ డే విత్ మన లెజెండ్🤩
నందమూరి బాలకృష్ణ గారు😍
తెలుగుజాతి గర్వపడేలా 🔥
సంబరాన్ని అంబరాన్ని అంటేలా🥳
ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్ లో ఉండబోతుంది🤩
మరి మిస్ అవ్వకుండా చూడండి StarSportsTelugu/HD#IPLOnStar #JaiBalayya #BalaKrishna #HushaaruOn pic.twitter.com/GpARnqMdgg