Kangana Ranaut: ఒలింపిక్స్ వేడుకల్లో నగ్న ప్రదర్శన.. ఫైర్ బ్రాండ్ సంచలన పోస్ట్

పారిస్‌లో అట్టహాసంగా జరుగుతున్న ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలసేనే యావత్ ప్రపంచం దృష్టి ఉంది.

Update: 2024-07-28 04:15 GMT

దిశ, సినిమా: పారిస్‌లో అట్టహాసంగా జరుగుతున్న ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలసేనే యావత్ ప్రపంచం దృష్టి ఉంది. అయితే ఈ వేడుకలకు మెగా ఫ్యామిలీ చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, క్లిన్ కారా కూడా హాజరైన విషయం తెలిసిందే. సెయిన్ ఒడ్డున అంగరంగ వైభవంగా జరగ్గా దీనికి ఐదు లక్షల మంది ప్రేక్షకులు హాజరైనట్లు సమాచారం. ఇందులో భాగంగా కొందరు ప్రవర్తించిన తీరు భయంకరంగా ఉందంటూ సెలబ్రిటీలు క్రీడాభిమానులు, రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, మంత్రి కంగనా రానౌత్ కూడా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించి సంచలన పోస్ట్ పెట్టింది. విపరీతమైన లైంగిక చర్యలు రెచ్చగొట్టేలా పలు సంఘటనలు ఉన్నట్లు తెలిపింది.

ఇందులో చిన్నపిల్లవాడిని కూడా చేర్చుకోవడం దారుణం అని అభిప్రాయపడింది. ఈ వేడుకలపై వరుస పోస్టులు షేర్ చేసి ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో అంతా స్వలింగ సంపర్కానికి సంబంధించినవి. అయితే నేను స్వలింగ సంపర్కానికి వ్యతిరేకంగా కాదు. నాకు మించినది ఒలింపిక్స్ ఏ లైంగికతకు సంబంధించినది? మానవ ఔన్నత్యాన్ని శృంగారం ద్వారా ఆక్రమించుకోవడానికి అన్ని దేశాల ఆటలు, క్రీడల భాగస్వామ్యం ఎందుకు? మన బెడ్‌రూమ్‌లలో సెక్స్ ఎందుకు ఉండకూడదు? అది జాతీయ గుర్తింపుగా ఎందుకు ఉండాలి.

ఇదో విచిత్రం. ది లాస్ట్ సప్పర్ హైపర్ క్వలైజ్డ్, దైవదూషణ ప్రదర్శన ఒక పిల్లవాడిని చేర్చుకున్నందుకు పారిస్ ఒలింపిక్స్ నిప్పులు చేరుగుతోంది. వారు జీసస్‌గా నీలి రంగు పూజిన నగ్న వ్యక్తిని చూపించారు. క్రైస్తవ మతాన్ని అవమానించారు. వామపక్షవాదులు 2024 ఒలింపిక్స్‌కు పూర్తిగా హైజాక్ చేశారు. అవమానించారు’’ అని రాసుకొచ్చింది.

 

 

Tags:    

Similar News