హ్యాపీ బర్త్ డే బాబాయ్.. నెట్టింట ఆకట్టుకుంటోన్న NAGABABU- VARUN TEJ పోస్ట్.. రేర్ ఫొటో వైరల్

నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా వరుణ్ తేజ్ ఓ ఆకట్టుకునే ఫొటో షేర్ చేస్తూ విష్ చేశారు.

Update: 2024-09-02 08:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా వరుణ్ తేజ్ ఓ ఆకట్టుకునే ఫొటో షేర్  చేస్తూ పవన్ కు విష్ చేశారు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు బాబాయ్. నేను ఎప్పుడూ మీరు పై స్థాయిలో ఉండాలని కోరుకుంటాను. ధర్మం వైపు మీరు అనుసరించిన మార్గం, ఇతరులకు సహాయం చేయాలనే మీ తిరుగులేని సంకల్పం అనంతంగా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. మీలోని అగ్ని ప్రకాశవంతంగా మండుతూనే ఉంటుంది. మీకు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, బలంగా ఉండాలని కోరుకుంటున్నాను. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తునే ఉంటాను. మీరు నా శక్తి తుఫాను. హ్యాపీ బర్త్ డే జనసేనాని’ అంటూ హీరో వరుణ్ తేజ్ కొణిదెల సోషల్ మీడియా వేదికన పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిజయేశారు.

అలాగే వరుణ్ తండ్రి నాగబాబు కూడా ఈ ఏడాది పవన్ కల్యాణ్ పుట్టినరోజు ఎంతో ప్రత్యేకమని అన్నారు. ఎందుకంటే.. ‘జెండా పట్టిన జనసైనికులకి, నమ్మి నడిచిన నాయకులకి, నువ్వొస్తె మార్పు తెస్తావ్ అని‌ ఎదురుచూసే నాలాంటి ఎంతో మందికి మర్చిపోలేని బహుమానం ఇచ్చిన ఏడాది కాబట్టి.. ఉన్నత విలువలున్న వ్యక్తిగా ఉపముఖ్యమంత్రిగా జరుపుకుంటున్న మొదటి పుట్టిన రోజు ఇది. కాాగా ఈ బర్త్ డే మరింత ప్రత్యేకమని నాగబాబు.. తమ్ముడు పవన్ కల్యాణ్ కు విషెష్ తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లు‌ జనసేనాని.. మీ జనసైనికుడు నాగబాబు’ అంటూ ట్వీట్ చేశారు.


Similar News