విడాకులపై నాగచైతన్య కామెంట్స్.. సమంత రియాక్షన్ !

టాలీవుడ్ క్యూట్ కపుల్ సమంత, నాగచైతన్య విడిపోయి దాదాపు రెండేళ్లు కావొస్తోంది.

Update: 2023-05-06 06:56 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ క్యూట్ కపుల్ సమంత, నాగచైతన్య విడిపోయి దాదాపు రెండేళ్లు కావొస్తోంది. అయినా వీరిద్దరి గురించి ఇప్పటికీ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ఇక తన తాజా చిత్రం ‘కస్టడీ’ ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతు, ఫస్ట్ టైమ్ తాము డివోర్స్ తీసుకోవడానికి గల రీజన్స్ బయట పెట్టాడు. ‘సమంతతో గడిపిన రోజుల్ని చాలా గౌరవిస్తాను, ఆమె చాలా లవ్లీ పర్సన్‌, ఎప్పటికీ సంతోషంగా ఉండాలి. అన్ని ఆనందాలకు ఆమె అర్హురాలు’ అంటూ మాజీ భార్యపై ప్రశంసలు కురిపించాడు. ఈ మాటలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఇక దీనిపై సమంత రియాక్ట్ అవుతూ.. ‘మనమంతా ఒక్కటే. కేవలం అహంకారం, భయాలు మనల్ని దూరం చేస్తాయి’ అంటూ తన ఇన్ స్టా లో ఓ కొటేషన్‌ షేర్‌ చేసింది. వీరిద్దరి వ్యవహారం చూస్తుంటే.. చైతు, సామ్‌ ఈగోలకు పోయి విడిపోయారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Read more:

ఆ రూమర్స్ వల్లే మేము విడిపోవాల్సి వచ్చింది.. విడాకులపై నాగచైతన్య కామెంట్స్

Tags:    

Similar News