Naga Chaitanya : ఇద్దరు స్టార్ హీరోయిన్లతో నాగచైతన్య రొమాన్స్.. ఎవరా భామలు..?
వరుస పరాజయాలు చవిచూస్తున్న టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: వరుస పరాజయాలు చవిచూస్తున్న టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. శ్రీకాకుళంలోని కళింగపట్నం మత్య్సకారుల కథా నేపథ్యంలో కొనసాగే ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ నిర్మిస్తుంది. అయితే ఈ మూవీలో చైతు సరసన కీర్తిసురేష్, అనుపమా పరమేశ్వరన్ నటించనున్నారని సమాచారం. కీర్తి మెయిన్ హీరోయిన్ పాత్రలో.. హీరోతో ట్రావెల్ అయ్యే రోల్‌లో అనుపమ కనిపించనుందట. కాకపోతే ఈ భామ పాత్ర కీలకంగా ఉంటుందట. నాగచైతన్య మత్య్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో మూవీ అంటే అక్కినేని ఫ్యాన్స్ భారీ అంచనాలు పెంచేసుకుంటున్నారు. ఇక ‘ఇద్దరు అందాల భామలతో సినిమా అంటే ఎంత రోమాంటిక్‌గా ఉంటుందో’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
Read More..
నాగచైతన్య అలాంటోడు.. సమంతే కరెక్ట్.. డేటింగ్ తర్వాత శోభిత ధూళిపాళ షాకింగ్ కామెంట్స్!