నా గురించి నిజాలు వాళ్లకు మాత్రమే తెలుసు..? విడాకులపై మరోసారి స్పందించిన నాగచైతన్య..!
నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవున్న మాజీ జంట నాగ చైతన్య, సమంత.
దిశ, వెబ్‌డెస్క్: నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవున్న మాజీ జంట నాగ చైతన్య, సమంత. వీరి ఇద్దరు ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల చేత విడిపోయారు. ఇక అప్పటి నుంచి చైతు, సామ్‌ల గురించి ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. నాగచైతన్య, సమంత ఎక్కడికి వెళ్లిన తన పర్సనల్ లైఫ్ గురించి ప్రశ్నిస్తున్నారు. అయితే.. తన విడాకుల గురించి ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలో చెప్పిన నాగచైతన్య మరోసారి వైరల్ కామెంట్స్ చేశాడు.
‘ఒక పాయింట్ తర్వాత.. దాని గురించి నేను పట్టించుకోను. నాతో క్లోజ్‌గా ఉన్నావారికి నా గురించి నిజాలు తెలుసు. అయిన.. ఆ విషయాలు పక్కన పెడితే.. నా పర్సనల్ లైఫ్ ద్వారా నేను అందరికీ తెలియడం కంటే.. నా వర్క్ పరంగా, యాక్టర్‌గా అందరూ నన్ను గుర్తుంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. అందుకే నేను నా వర్క్‌పై, సినిమాలపై దృష్టి పెట్టాలి అనుకుంటున్నాను. నా సినిమాల ద్వారా నేను ప్రేక్షకులు ఎంటర్టైన్ చేయగలితే.. అప్పుడు వాళ్లే నా పర్సనల్ లైఫ్ గురించి కాకుండా నా గురించి మాట్లాడుకుంటారు’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా.. నాగచైతన్య, విక్రమ్ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘దూత’ వెబ్ సిరీస్ డిసెంబర్-1 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది.