నా కొడుకుని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తున్నారు : Vijay Deverakonda ఫాదర్
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు
దిశ,వెబ్ డెస్క్: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు సినిమాల ఫ్లాపుల తర్వాత ఎట్టకేలకు ఖుషి సినిమాతో హిట్ కొట్టి విజయ్ తన సత్తా చూపించాడు. సెప్టెంబర్ 01 వ తేదీన విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. ఈ సక్సెస్ అభిమానులతో పంచుకోవాలనే ఉద్దేశంతో హీరో విజయ్ 100 కుటుంబాలకు కోటి రూపాయలను బహుమతిగా ఇస్తానని వెల్లడించాడు.
ఇదిలా ఉండగా విజయ్ ఈ ఆఫర్ ప్రకటించగానే అభిషేక్ పిక్చర్స్ ట్విట్టర్ వేదికగా.. మా డిస్ట్రిబ్యూటర్స్ రూ.8 కోట్లు నష్ట పోయారు.. మీ మంచి మనసుతో వారిని కూడా ఆదుకోవాలంటూ ట్వీట్ చేసారు. తాజాగా ఈ విషయంపై విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధన్ రావు స్పందించారు. అభిషేక్ నా కొడుకుని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నాడు.. ఇలా చేయడం కరెక్ట్ కాదు? వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా పారితోషికంలో సగం ఇచ్చేసాడు.. ఇంత కన్నా ఏమి చేయాలి. అభిషేక్ నామాతో ఇక సినిమాలు చేయడంటూ గోవర్ధన్ రావు క్లారిటీ ఇచ్చారు.