అలాంటి సీన్స్‌లో నటిస్తే నా భర్త విడాకులిస్తాడు.. Priyamani కామెంట్స్ వైరల్
సీనియర్ హీరోయిన్ ప్రియమణి ‘ఎవరే అతగాడు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.
దిశ, వెబ్ డెస్క్: సీనియర్ హీరోయిన్ ప్రియమణి ‘ఎవరే అతగాడు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన అనేక చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా రాణించింది. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే ప్రముఖ వ్యాపారవేత్త ముస్తఫాను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కొద్ది కాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చి బుల్లితెర షోస్‌తో అలరించింది. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది. ఇటీవల నాగచైతన్య ‘కస్టడీ’ సినిమాలో విలన్ పాత్రలో నటించి మెప్పించింది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణి ముద్దు సీన్లకు ఎందుకు దూరం అయిందో తెలిపింది. ఆమె మాట్లాడుతూ.. ‘‘ నేను పెళ్లి అయిన తర్వాత ముద్దు సీన్లలో నటించకూడదని నిర్ణయం తీసుకున్నాను. అలాంటి సీన్లలో నటిస్తే నా భర్తకు నేను సమాధానం చెప్పాల్సి వస్తుంది. అది మంచి వాతావరణం కాదు. నా సినిమాలు ఏవైనా సరే ఇరువురి ఇంట్లో వారు చూస్తారు. వారు అలాంటి సీన్స్ చూస్తే ఇబ్బందిగా ఫీల్ అవుతారు. నా భర్త చాలా సాఫ్ట్ కార్నర్. అలాంటివి చూసి నాకు విడాకులు ఇచ్చినా నేను ఏం చేయలేను’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రియమణి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Also Read: తెలుగు స్టార్ హీరోల ఫస్ట్ రెమ్యూరేషన్ ఎంతో తెలుసా?