ఐదు కోట్లు రాబట్టలేని వాళ్లుకూడా రూ.25 కోట్లు అడుగుతున్నారు: కరణ్

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ తెలుగు, హిందీ ఇండస్ట్రీల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Update: 2023-01-06 12:52 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ తెలుగు, హిందీ ఇండస్ట్రీల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అంతేకాదు ఇటీవల అకస్మాత్తుగా పెరిగిపోతున్న భారీ బడ్జెట్‌ల గురించి కూడా తాజా ఇంటరాక్షన్‌లో తనదైన స్టైల్‌లో రియాక్ట్ అయ్యాడు. 'నాకు హిందీ సినిమాపట్ల చాలా ప్రేమ, ఎమోషన్ ఉంది. కానీ, ఒక వ్యాపారవేత్తగా తెలుగు చాలా లాభదాయకమైన పరిశ్రమగా భావిస్తున్నా' అని చెప్పాడు. అలాగే రూ.5 కోట్ల ఓపెనింగ్ గ్యారెంటీ కూడా ఇవ్వలేని నటుడు రూ. 20 కోట్లు రెమ్యునరేషన్ అడగడం అన్యాయమని చెప్పుకొచ్చాడు.

ఈ క్రమంలోనే దివంగత చిత్రనిర్మాత యష్ చోప్రా చెప్పిన.. 'ఒక చిత్రం ఎప్పుడూ ఫెయిల్యూర్ కాదు. బడ్జెట్‌ పరంగానే పరాజయం పాలవుతుంది' అనే మాటను గుర్తుచేశాడు. ఇక సినిమా ద్వారా ఎవరు ఎంత డబ్బు సంపాదిస్తున్నారనే ప్రశ్నకు బదులిస్తూ.. దురదృష్టవశాత్తూ ఈ సమాధానం తాను చెప్పలేనని, అనుకోకుండా చెప్పినా సినీ తారల తనను హత్య చేయవచ్చంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడు. ఇక ఇండస్ట్రీలో వచ్చే రూమర్స్‌పై స్పందిస్తూ 'భ్రమ అనేది టీకా లేని ఒక వ్యాధి' అని ఆన్సర్ చేశాడు. చివరగా సిని పరిశ్రమలో నల్లధనం లేదని బలంగా చెప్పగలనన్న ఆయన.. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమా హిట్ అయినప్పటికీ తాను చాలా డబ్బు పోగొట్టుకున్నట్లు వెల్లడించాడు.

Tags:    

Similar News