నా హృదయం నిండిపోయింది.. ఒక తల్లిగా నాకు ఎనలేని సంతోషాన్ని ఇచ్చింది.. రేణు దేశాయ్ ఎమోషనల్
జనసేనాని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం నుంచి పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ దంపతుల కుమారుడు అకీరా నందన్ బాగా వార్తలలో నిలుస్తూ వస్తున్నాడు.
దిశ, సినిమా: జనసేనాని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం నుంచి పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ దంపతుల కుమారుడు అకీరా నందన్ బాగా వార్తలలో నిలుస్తూ వస్తున్నాడు. దానికి కారణం తన తండ్రి పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రధాని మోదీని కలవడమే. మోడీ అకిరాతో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో రిలీజైనప్పటి నుంచి పెద్ద ఎత్తున ఇదే విషయం మీద చర్చ జరుగుతుంది. తాజాగా అఖిరా నందన్ మోడీతో కలిసి ఉన్న ఒక ఫోటోను షేర్ చేసిన రేణు దేశాయ్ ఎమోషనల్ అయ్యారు. తన భావన అంతా సోషల్ మీడియా వేదికగా ఆమె పంచుకున్నారు.
దీనిలో భాగంగా ఒక తల్లిగా నాకు ఎనలేని సంతోషాన్ని ఇచ్చిన సందర్భం కళ్యాణ్ గారితో అకిరా వెళ్లి నరేంద్ర మోడీ గారిని కలిసి వారితో ఫోటో దిగడం. వ్యక్తిగతంగా నాకు బీజేపీ అలాగే మోడీ గారు అంటే చాలా అభిమానం. అలాంటిది ఈ రోజు ఈ ఫోటో చూస్తుంటే నా మనసు ఉద్వేగానికి గురైంది, నా కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి. నా హృదయం నిండిపోయింది, ఆకీరాని దీవించిన మోడీ గారికి ధన్యవాదాలు. అలాగే అకిరా మీద ఇంత ప్రేమ కురిపిస్తున్న మీ అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు అంటూ ఆమె సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. అంతేకాదు ఈ ఫోటో కింద కామెంట్లు పెడుతున్న చాలా మందికి ఆమె సమాధానం ఇస్తున్న వైనం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.