‘దేవర’ సినిమాలో మా నాన్న యాక్టింగ్ కుమ్మేశాడు.. కళ్యాణ్ రామ్ షాకింగ్ కామెంట్స్! (వీడియో)

కొరటాల శివ తెరకెక్కించిన మోస్ట్ వెయిటెడ్ సినిమా ‘దేవర’ సెప్టెంబర్ 27న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

Update: 2024-09-28 10:21 GMT

దిశ, సినిమా: కొరటాల శివ తెరకెక్కించిన మోస్ట్ వెయిటెడ్ సినిమా ‘దేవర’ సెప్టెంబర్ 27న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో ఎన్టీఆర్ హీరోగా నటించగా.. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. అయితే దేవర భారీ అంచనాల మధ్య విడుదలై హిట్ కావడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ మూవీ కలెక్షన్ల పరంగా కూడా బాక్సాఫీసును షేక్ చేస్తోంది. ఫస్ట్ రోజే ఏకంగా రూ.172 కోట్లు సాధించి అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.

ఈక్రమంలో.. తాజాగా, మేకర్స్ దేవర సక్సెస్ ఈవెంట్ నిర్వహించగా ఇందులో కళ్యాణ్ రామ్ పాల్గొని షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘నాలుగేళ్లుగా మేమందరం పడిన కష్టం మా ఈ దేవర ఈ రోజు మీ ముందుకు వచ్చింది. ఈ సినిమాపై మీరు చూపిస్తున్న ఆదరాభిమానాలకు ఇస్తున్న రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్‌కు మా ప్రేక్షకులకు, నందమూరి అభిమానులకు ధన్యవాదాలు.

దేవరకు కొరటాల శివ అద్భుతమైన కథ ఇచ్చారు. ఇందులో మా నాన్న కుమ్మేశాడు. ఇరగదీశారు నాన్న నీ యాక్టింగ్ అదుర్స్. నేను గర్వంగా చెబుతున్నాను ఇది వన్ మ్యాన్ షో. చిన్న గూస్ బంప్స్ తీసుకొచ్చింది. క్లైమాక్స్‌లో అతను పడే తపన చాలా బాగుంది. అందరికీ ధన్యవాదాలు’’అని చెప్పుకొచ్చారు. ఇక ఈ కామెంట్స్ విన్న వారంతా ఇందులో కళ్యాణ్ రామ్ ఉన్నారా? అని షాక్ అవుతున్నారు. కానీ అవి ఎన్టీఆర్ గురించి అని ఆనంద పడుతున్నారు.


Similar News