కెరీర్‌ విషయంలో నా యాటిట్యూడ్‌ అలాగే ఉంటుంది: సానియా మల్హోత్ర

బాలీవుడ్‌ స్టార్ యాక్టర్స్‌లో సానియా మల్హోత్ర ఒకరు. కామెడీ, యాక్షన్‌, ఫ్యామిలీ డ్రామా ఇలా డిఫరెంట్‌ జానర్స్‌

Update: 2024-03-03 08:27 GMT

దిశ, సినిమా: బాలీవుడ్‌ స్టార్ యాక్టర్స్‌లో సానియా మల్హోత్ర ఒకరు. కామెడీ, యాక్షన్‌, ఫ్యామిలీ డ్రామా ఇలా డిఫరెంట్‌ జానర్స్‌ ఎంచుకుంటూ తనకంటూ మంచి సర్కిల్ క్రియెట్ చేసుకుంది. ప్రజంట్ చిన్నా పెద్దా అనే తేడా లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇందులో భాగంగా తాజాగా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో ముచ్చటించిన సానియా.. తన వ్యక్తిగత విషయాలు పంచుకుంది.. నటి మాట్లాడుతూ.. ‘గతేడాది నేను నటించిన 5 సినిమాలు విడుదల అయ్యాయి. ఫలితం ఎలా ఉన్నా.. నటిగా మాత్రం నాకు మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా ‘సామ్‌ బహదూర్‌’ సినిమాలో నా వయసుకు మించిన పాత్ర పోషించే అవకాశం వచ్చింది.

దాని కోసం చాలా హార్డ్‌వర్క్‌ చేశా. అందులో మానెక్‌‌షా పాత్ర పోషించిన విక్కీ కౌశల్‌ నను ఎంతగానో సపోర్ట్‌ చేశారు. ఫైనల్ గా ఆ సినిమా చూసుకుంటూ ఉంటే ఆనందంతో కన్నీళ్లు ఆగలేదు.. అందరూ నను చాలా మెచ్చుకున్నారు. ఇక మనిషికి ఓపిక చాలా అవసరం. కష్టపడి సరిపోదు. నిదానమే ప్రధానం..! నా యాటిట్యూడ్‌ అలాగే ఉంటుంది. నా అవసరం ఉందనుకుంటే మాత్రమే స్పందిస్తా! కెరీర్‌ విషయంలో కూడా తెగ హైరానా పడిపోను. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం పైనే దృష్టి పెడతాను.. అందులో మనం విజయం సాధిస్తే వద్దన్నా అవకాశాలు క్యూ కడతాయి’ అంటూ చెప్పుకొచ్చింది సానియా మల్హోత్రా.

 


Similar News