హనుమాన్ కోసం ప్రాణం పెట్టిన మ్యూజిక్ డైరెక్టర్!
చేసే పనిలో శ్రద్ధాసక్తులు ఉంటే విజయం తప్పకుండా ఉంటుందనే దానికి నిలువెత్తు నిదర్శనం ప్రముఖ సంగీత దర్శకుడు గౌర హరి.
దిశ, సినిమా: చేసే పనిలో శ్రద్ధాసక్తులు ఉంటే విజయం తప్పకుండా ఉంటుందనే దానికి నిలువెత్తు నిదర్శనం ప్రముఖ సంగీత దర్శకుడు గౌర హరి. యాడ్స్, టీవీ సీరియల్స్‌కు సంగీతాన్ని సమకూర్చి.. మ్యూజిక్ డైరెక్టర్‌గా కెరీర్ స్టార్ చేశాడు గౌర హరి. అలాంటి డైరెక్టర్ ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న హనుమాన్ చిత్రానికి పనిచేసే స్థాయికి ఎదిగారు. ఇక ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ సంగీతాన్ని సమకూర్చారు.
అనుధీప్ దేవ్ ఆవకాయ అంజనేయ అనే సాంగ్ కంపోజ్ చేశారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణ సౌరభ్ ఒక ఎమోషనల్ సాంగ్ చేశారు. ఇక సినిమాలో పాటలు, నేపథ్య సంగీతం మ్యూజిక్ డైరెక్టర్ గౌర హరి చేశారు. ఈయన ఈ చిత్రానికి దాదాపు రెండు సంవత్సరాలు ఎంతో కష్టపడి సంగీతాన్ని సమకూర్చారు. ముఖ్యంగా ఇప్పటి వరకు విడుదల అయిన బీజీఎం, హనుమాన్ చాలీసా ,శ్రీరామ దూత స్తోత్రం ,ఎంత ప్రభంజనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఆ పాటలు వింటుంటే రోమాలు నిక్కబొడుచు కుంటున్నాయి అంటే దానికోసం గౌర హరి ఎంత ఎఫర్ట్ పెట్టారో అర్థం చేసుకోవచ్చు. డైరెక్టర్ విజన్ కు తగ్గట్టుగా, తీసిన విజువల్స్ ను మరొక మెట్టు ఎక్కించడంలో గౌర హరి వంద శాతం విజయం సాధించారు. ఇక పాన్ ఇండియా మ్యూజిక్
డైరెక్టర్ గా గుర్తింపు పొందిన గౌర హరి మరిన్ని అద్భుతమైన చిత్రాలకు తన మార్క్ చూపిస్తారు అనడంలో అతిశయోక్తి లేదు.
ఈ చిత్ర ప్రొమోషన్ లో లో కూడా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ , గౌర హరి పనితనం గురించి ఎంతో గొప్పగా పొగిడారు. బీజీఎం అద్భుతంగా ఇచ్చారని, గౌర హరి పేరు ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తుందని పేర్కొన్నారు. రెండు సంవత్సరాలుగా అంతే ఉత్సాహంతో ఒకే సినిమాకు పనిచేయడం గ్రేట్ అని హీరో తేజ సజ్జ కొనియాడారు. ఆయన ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత కన్న ఎక్కువే పెట్టారు, అందుకే ట్రైలర్‌కు అంత రీచ్ వచ్చిందని హీరో అన్నారు. సినిమాకు బ్యాగ్రౌండ్ స్కోర్ చేసిన గౌర హరి హనుమాన్ తర్వాత చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతారని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వెల్లడించారు.