చరిత్ర సృష్టించిన మురారి రీ రిలీజ్.. ఖుషీ, కల్కి రికార్డులు అవుట్

గత కొద్ది కాలంగా రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. బడా హీరోల సినిమాలు అన్ని వారి బర్త్ డేల సందర్భంగా రీ రిలీజ్ అవుతూ బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్నాయి.

Update: 2024-08-11 09:56 GMT

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. బడా హీరోల సినిమాలు అన్ని వారి బర్త్ డేల సందర్భంగా రీ రిలీజ్ అవుతూ బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్నాయి. విడుదలైనప్పుడు పెద్దగా మెప్పించలేనివి కూడా రీరిలీజ్‌లో సూపర్ హిట్ అవుతున్నాయి. ఇటీవల మహేష్ బాబు క్లాసిక్ హిట్ మురారి ఆగస్టు 9న సూపర్ స్టార్ బర్త్ డే సందర్భంగా రీరిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఫ్యాన్స్ మళ్లీ మళ్లీ చూస్తూ థియేటర్స్‌లో రచ్చ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా, మురారి రీరిలీజ్‌లో రికార్డులు బ్రేక్ చేస్తూ దూసుకుపోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ మూవీ రీ రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఖుషీ సినిమాను దాటినట్లు తెలుస్తోంది. ఆంధ్ర, తెలంగాణలో ఖుషీ రీరిలీజ్‌లో 10 రోజుల్లో 7.4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా.. మురారి రీరిలీజ్‌లో కేవలం రెండు రోజుల్లోనే 7.4 కోట్లు రాబట్టి చరిత్ర సృష్టించింది. అలాగే కల్కి రికార్డులు కూడా బ్రేక్ చేసినట్లు టాక్.

వరల్డ్ వైడ్‌గా మొత్తం కల్కి సినిమాకు రూ. 2 కోట్ల గ్రాస్ వసూలు కాగా.. మురారి సినిమాకు రూ. 5 కోట్ల రూపాయలు గ్రాస్ సాధించినట్లు తెలుస్తోంది. అంటే.. కల్కిపై మురారి 3 కోట్లు ఎక్కువగా కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అలాగే బుక్ మై షోలో మురారి 2 లక్షల 50 వేల టికెట్లు అమ్ముడు పోయినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుండటంతో.. అది తెలుసుకున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందంలో ఎగిరిగంతేస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు.

Tags:    

Similar News