మృణాల్ ఠాకూర్ పెళ్లి ఫిక్స్ అయిందా.. హింట్ ఇచ్చేసిందంటున్న నెటిజన్లు?

యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ‘సీతారామం’ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది.

Update: 2024-07-24 12:44 GMT

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ‘సీతారామం’ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రంలోని సాంప్రదాయ లుక్స్‌లో, తన అందం, అభినయంతో ఓవర్ నైట్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల హాయ్ నాన్న మూవీతో హిట్ కొట్టింది. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కిలో కీలక పాత్రలో నటించి మెప్పించింది.

ఆ తర్వాత ఏ కొత్త సినిమా ప్రకటించినప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ వరుస పోస్టులతో నెట్టింట రచ్చ చేస్తోంది. వెకేషన్స్‌కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేయడంతో పాటుగా ఫ్రెండ్స్‌తో సమయాన్ని గడుపుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, మృణాల్ ఓ స్టార్ హీరోను పెళ్లి చేసుకోబోతుందంటూ నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇన్నాళ్లు హాట్ ఫొటోలు షేర్ చేసిన ఆమె గత కొద్ది రోజుల నుంచి ఈ అమ్మడు సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఫొటోలు షేర్ చేస్తుండటంతో.. పెళ్లి పీటలెక్కబోతుందా? అందుకే ఈ ఫొటోలతో హింట్ ఇస్తోందా? అని పలు రకాల పుకార్లు షికారు చేస్తున్నాయి.

అయితే గతంలో ఈ అమ్మడు ఓ టాలీవుడ్ హీరోతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ అమ్మడు ఆ వార్తలకు స్పందించకపోవడంతో.. అతనితోనే అమ్మడు పెళ్లి ఫిక్స్ అయిందని ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో రూమర్లు జోరందుకున్నాయి. కానీ ఫ్యాన్స్ మాత్రం వీటిల్లో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేస్తున్నారు. అమ్మడు బాలీవుడ్‌లో సినిమాలు చేయడానికి రెడీగా ఉంది. ఈ క్రమంలో ఆఫర్ల కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఖాళీ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

(Video Link Credits to Mrunal Thakur Instagram Channel)

Tags:    

Similar News