Mrunal Thakur: అవమానం భరించలేక కన్నీరు పెట్టుకున్నా.. సీతా ఎమోషనల్
బ్యూటీఫుల్ యాక్ట్రెస్ మృణాల్ ఠాకూర్ తన అభిమానులను ఆందోళనకు గురిచేసింది.
దిశ, సినిమా : బ్యూటీఫుల్ యాక్ట్రెస్ మృణాల్ ఠాకూర్ తన అభిమానులను ఆందోళనకు గురిచేసింది. గతేడాది వచ్చిన ‘సీతారామం’తో భారీ పాపులారిటీ సంపాదించుకున్న నటి తాజాగా ఇన్‌స్టా వేదికగా పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. విషయానికొస్తే.. గతంలో తాను ఎన్నో గడ్డుపరిస్థితులు ఎదుర్కొన్నానని చెబుతూ కన్నీరు పెట్టుకున్న ఓ ఫొటోను షేర్ చేసింది. ‘గడిచిన కాలం నన్ను ఎన్నో కష్టాలపాలు చేసింది. నాలాగే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భిన్నమైన స్టోరీ ఉంటుంది. అయితే ఇలాంటివి చెప్పడానికి ఎవరూ ఆసక్తి చూపించరు. నేను అలా చేయను. నా గురించి ప్రపంచానికి తెలిసేలా చెబుతా. ఎందుకంటే నా కథ మరొకరికి పాఠం నేర్పుతుందని భావిస్తా. మనకు ఎదురైన అవమానాల వల్ల బలహీనంగా మారినప్పటికీ.. వాటన్నింటీ ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలి. ఈ రోజు నేను సంతోషంగా ముందుకెళుతున్నా’ అంటూ వివరించింది.
ఇవి కూడా చదవండి:
Rashmika: ఆ స్టెప్ వేయడం నా వల్ల కాదు.. ప్లీజ్ ఇక అడగొద్దు