ఆ వయసులో పుట్టే ప్రేమకు అర్థం లేదు.. మృణాల్ ఠాకూర్

హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా వచ్చిన చిత్రం 'సీతారామం'. ఆగస్టు 5న విడుదలైన ఈ మూవీ భారీ విజయం సాధించడంతో మృణాల్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోగా వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి.. Latest Telugu News

Update: 2022-10-07 08:08 GMT

దిశ,సినిమా: హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా వచ్చిన చిత్రం 'సీతారామం'. ఆగస్టు 5న విడుదలైన ఈ మూవీ భారీ విజయం సాధించడంతో మృణాల్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోగా వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇదిలావుంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యంగ్ బేబి.. తన ప్రేమ, పెళ్లి, వయసు గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. '20 ఏళ్ల వయసులో పుట్టే ప్రేమకు.. 30 ఏళ్లలో పుట్టే ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంది. 20 ఏళ్లలో ఏది తప్పు ఏది రైటు అనే విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోరు. ఆ వయసులో ఒక వ్యక్తి మనల్ని ప్రేమిస్తే మనం కూడా ఈజీ‌గా ప్రేమిస్తాం. కానీ, 30 ఏళ్ల వయసులో పుట్టిన ప్రేమలో ఆ వ్యక్తిని ఎక్కువగా ప్రేమించాలి. అతను మన‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటాం' అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి : నాకు కడుపు చేసి మరొక నటితో ఎఫైర్ పెట్టుకున్నాడు.. భర్తపై కేసు పెట్టిన దివ్య


Similar News