నాకు నేనే ఇష్టం.. నన్ను నేనే ప్రేమించుకుంటా: మృణాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
నాని సినిమా ‘హాయ్ నాన్న’తో ప్రేక్షకులను అలరించబోతున్న యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్.. సినీ కెరీర్లో తనకు స్ఫూర్తినిచ్చిన అంశాలపై ఓపెన్ అయింది.
దిశ, సినిమా : నాని సినిమా ‘హాయ్ నాన్న’తో ప్రేక్షకులను అలరించబోతున్న యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్.. సినీ కెరీర్లో తనకు స్ఫూర్తినిచ్చిన అంశాలపై ఓపెన్ అయింది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా తాజాగా ఓ సమావేశంలో పాల్గొన్న ఆమె.. ‘జబ్ వీ మెట్’లో కరీనా కపూర్ పోషించిన ‘గీత్’ క్యారెక్టర్ తనను ప్రేరేపించిందని చెప్పింది. ‘ఈ మూవీలో కరీన తీసుకున్న నిర్ణయాలు, ఆమె ప్రయాణం నుంచి గొప్ప అనుభూతి పొందాను. ముఖ్యంగా కరీన చెప్పే ‘నాకు నేనే ఇష్టం’ అనే డైలాగ్ బాగా నచ్చింది. అది ఎప్పటికీ మరిచిపోలేను’ అని తెలిపింది.
అలాగే ‘నేను ఎప్పుడూ ఒకచోట ఉండలేను. నిరంతరం తిరుగుతూనే ఉంటాను. ప్రయాణాలంటే చాలా ఇష్టం. అందరిలాగే జీవితాన్ని ఆనందంగా గడిపేయాలనుకుంటాను. ఎల్లప్పుడూ మనల్ని మనం ప్రేమించుకోవాలి. మన నిర్ణయాలు మనమే తీసుకోవాలి. నేను ఎప్పుడూ సంతోషంగా ఉండటానికి కారణం అనందాన్ని ఆస్వాదించడమే’ అంటూ చెప్పుకొచ్చింది.