సీత.. చీరకట్టులో ఆ సొగసు చూడ తరమా?
అందాల భామ మృణాల్ ఠాకూర్ మరోసారి ప్రేక్షకుల మనసు దోచేసింది.
దిశ, సినిమా : అందాల భామ మృణాల్ ఠాకూర్ మరోసారి ప్రేక్షకుల మనసు దోచేసింది. 'సీతారామం'లో సీతగా విమర్శకులను సైతం మెప్పించి ప్రశంసలు అందుకున్న బ్యూటీ తాజాగా బ్యూటిఫుల్ లుక్‌లో దర్శనమిచ్చి అట్రాక్ట్ చేసింది. ఈ మేరకు పింక్ కలర్ చీర కట్టి హొయలుపోయిన నటి చెవులకు పెద్ద బంగారు బుట్టీలు, మెడలో నెక్లెస్‌తో అందంగా కనిపించింది. బ్యాక్ గ్రౌండ్లోనూ పచ్చటి చెట్లతో కూడిన గుట్టలు కనిపిస్తుండగా మబ్బులతో కూడిన నీలాకాశం కింద నిలబడి విభిన్న యాంగిల్స్‌లో పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతుండగా అభిమానులు సీత అందాన్ని పొగిడేస్తున్నారు.