మోహన్ బాబు లేకుండా లక్ష్మీ ఇంట్లో మనోజ్ పెళ్లి.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
మంచు వాళ్ల ఫ్యామిలీకి సంబంధించిన ఏదో ఒక వార్త ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. అదులో ఈ మధ్య ఎక్కువ మంచు మనోజ్, భూమిక పెళ్లిపై చాలా వార్తలు వచ్చాయి
దిశ, వెబ్ డెస్క్ : మంచు వాళ్ల ఫ్యామిలీకి సంబంధించిన ఏదో ఒక వార్త ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. అదులో ఈ మధ్య ఎక్కువ మంచు మనోజ్, భూమిక పెళ్లిపై చాలా వార్తలు వచ్చాయి. తాజాగా మార్చి3న మంచు మనోజ్, తన సన్నిహితుల మధ్య భూమ మౌనికతో ఏడు అడుగులు వేయబోతున్నట్లు ఓ వార్త నెట్టింట్లో తెగ హల్ చల్ అవుతుంది.
అయితే ఈ విషయంలో మంచు ఫ్యామిలీలో చాలా గొడవలు జరుగుతున్నాయంట. భూమ మౌనిక టీడీపీ పార్టీ, మోహన్ బాబు ఫ్యామీలీ వైసీపీ పార్టీకి సపోర్టు కాబట్టి, మనోజ్, మౌనిక పెళ్లి విష్ణు, మోహన్ బాబు ఒప్పుకోవడం లేదంట. వీరు పెళ్లి చేసుకున్నా.. వారి పెళ్లికి విష్ణు, మోహన్ బాబు హాజరు కారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందుకోసమే మనోజ్ తన ఇంటి నుంచి బయటకు వచ్చి మంచు లక్ష్మీ ఇంట్లో పెళ్లి చేసుకుంటున్నాడని తెలుస్తుంది. కాగా, మంచు మనోజ్ పెళ్లి జరిగితే కానీ, ఈ విషయాలపై ఓ క్లారిటీ అనేది వచ్చేలా లేదు.
Read more: