‘దాస్ కా ధమ్కీ’ ట్రైలర్ రిలీజ్ చేసిన మంత్రి గంగుల కమలాకర్
విశ్వక్ సేన్ స్వీయదర్శకత్వంలో నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ‘దాస్ కా ధమ్కీ’.
దిశ, సినిమా : విశ్వక్ సేన్ స్వీయదర్శకత్వంలో నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ‘దాస్ కా ధమ్కీ’. వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మించిన చిత్రం మార్చి 22న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా కరీంనగర్లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి గంగుల కమలాకర్ ట్రైలర్ రిలీజ్ చేశారు.
‘కరీంనగర్లో వేడుకలు జరుపుకున్న ప్రతి సినిమా ఘన విజయం సాధించింది. అలాగే ఈ మూవీ కూడా పెద్ద విజయం సాధిస్తుందని కోరుకుంటున్నా. చిత్ర యూనిట్‌కు ఆల్ దిబెస్ట్’ అన్నారు. అలాగే సినిమాను ఉద్ధేశిస్తూ మాట్లాడిన హీరో.. ‘ట్రైలర్ లాంచ్‌కు వచ్చిన మంత్రిగారికి, ఎమెల్యే రసమయి బాలకిషన్గారికి కృతజ్ఞతలు. ఉగాది రోజు విడుదలవుతున్న సినిమా ఉగాది పచ్చడిలాగే ఉంటుంది. థియేటర్లో పచ్చడి పచ్చడి చేస్తా. అందరికీ ఫుల్ ఎంటర్టైన్మెంట్’ అంటూ చెప్పుకొచ్చాడు.