మధ్యతరగతి మహిళలు ఆసక్తిగా ఉండరు!.. హీరామండి డైరెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Update: 2024-05-21 03:28 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతను తాజాగా 1940ల కాలంలో భారత్ బ్రిటిష్ పాలనలో ఉన్నటువంటి హీరామండి అనే రెడ్ లైట్ ప్రాంతంలో, జీవనం సాగించిన డ్యాన్సర్ల జీవితాల గురించి ‘హీరామండి: ది డైమండ్ బజార్’. సిరీస్‌లో దర్శకుడు భన్సాలీ చూపించారు. అంటే బ్రిటిష్ పాలనలో దారుణాలు ఎదుర్కొన్న ఆ మహిళల గురించి ఎన్నో విషయాలను ఈ సిరీస్‌లో చూపించాడు. కాగా, ఈ సిరీస్‌లో మనీష కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరి, రిచా చద్దా, సంజీదా షేక్, షార్మీన్ సెగల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్‌కి సంబంధించి డైరెక్టర్ భన్సాలీకి ప్రశంసలు దక్కుతున్నాయి. కానీ, ఆయన మిడిల్ క్లాస్ లేడీస్ ని ఉద్దేశించి అలాంటి మహిళలు అంటే తనకు అసలు ఆసక్తి ఉండదని చేసిన వ్యాఖ్యలు మాత్రం కొత్త చిక్కులు తెచ్చిపెట్టేలా ఉన్నాయి.

సంజయ్ లీలా భన్సాలీ మాట్లాడుతూ.. 'వేశ్యలు, వ్యభిచారిణి, తవాయిఫ్ ఇలా ఏ పేరుతో అయినా మీరు పిలుచుకోండి. కానీ, ఆ వృత్తిలో ఉండే మహిళల్లో ఎన్నో రహస్యాలు దాగుంటాయి. వాళ్లు కళాత్మకంగా జీవించే వ్యక్తులు. పాడగలరు, ఆడగలరు, వాళ్ళు మనసులో అనుకున్నది నిర్భయంగా, నిర్మొహమాటంగా చెప్పేయగలరు. వారిలో తెలియని ఒక నిగూఢ శక్తి దాగుంటుంది. వారికి ఈ సంగీతం, నృత్యాన్ని ఆస్వాదించడంలో ఎంతో ఆనందం ఉంటుంది. వాళ్లు రస హృదయం కలిగిన వ్యక్తులు. వాళ్ళు ధరించే దుస్తులు, ఆభరణాలు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు' అంటూ భన్సాలీ వ్యాఖ్యానించారు.

అలాగే మిడిల్ క్లాస్ మహిళల గురించి మాట్లాడుతూ.. 'నాకు మాత్రం అలాంటి పాత్రలే కావాలి. నేను పాఠశాలకు వెళ్లే రోజుల్లో రేషన్ షాప్ దగ్గర వరుసలో నిలబడి రేషన్ తీసుకునే మహిళలను చూసే వాడిని. వారికంటే కూడా నాకు ఇలాంటి మహిళలు అంటేనే ఎక్కువ ఆసక్తిగా ఉండేది. వేశ్యలు, సెక్స్ వర్కర్స్ అంటేనే ఎక్కువ ఆకర్షితుడు అయ్యేవాడిని. అంటూ హీరామండి డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ వ్యాఖ్యానించారు. మరి.. మధ్యతరగతి మహిళలు ఆసక్తిగా ఉండరు అనడంపై అతనిపై కొందరు నిప్పులు కక్కుతున్నారు.


Similar News