Odisha Train Accident: :కోరమండల్ రైలు ప్రమాదంలో 270 మంది మృతి.. అభిమానులకు చిరు కీలక పిలుపు!

ఒడిషాలో ఘోర ప్రమాదానికి గురైన కోరమండల్ రైలు ప్రమాద ఘటనపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.

Update: 2023-06-03 05:12 GMT
Odisha Train Accident: :కోరమండల్ రైలు ప్రమాదంలో 270 మంది మృతి.. అభిమానులకు చిరు కీలక పిలుపు!
  • whatsapp icon

దిశ, వెబ్‌‌డెస్క్: ఒడిషాలో ఘోర ప్రమాదానికి గురైన కోరమండల్ రైలు ప్రమాద ఘటనపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను చూసి హృదయం చెలించి పోతుందన్నారు. రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని కాపాడేందుకు రక్తం తక్షణ అవసరం ఉందని.. గాయపడిన వారి ప్రాణాలు రక్షించేందుకు రక్తం దానం చేయాలని తన అభిమానులకు చిరు కీలక పిలుపునిచ్చారు. అంతేకాకుండా తన అభిమానులు, ఘటన జరిగిన చోట స్థానికులు గాయపడిన వారికి వీలైనంత సహయం చేయాలని కోరారు.

ఇక, శుక్రవారం రాత్రి ఒడిషాలో కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆగి ఉన్న మరో గూడ్స్ రైలును కోరమండల్ ఢీకొట్టడంతో పెను ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 270 మంది మరణించగ.. మరో 1000 మందికి వరకు గాయపడ్డట్లు సమాచారం. మరికొందరు ప్రయాణికులు ఇంకా ట్రైన్ బోగీల్లోని చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఇక, ఘటన స్థలంలో పోలీసులు, రైల్వే పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు చేపట్టిన సహయక చర్యలు కొనసాగుతున్నాయి.


Also Read... Coromandel express accident : కోరమాండల్ రైలు ప్రమాదం.. కాంగ్రెస్ నేతలకు ఖర్గే కీలక సందేశం

కోరమండల్ ట్రైన్ యాక్సిడెంట్ : Jr. NTR ఎమోషనల్ ట్వీట్ 




 


Tags:    

Similar News