Megastar Chiranjeevi: మెగా ఫ్యామిలీలో విభేదాలు.. చిరంజీవి సంచలన నిర్ణయం?
తెలుగు ప్రజలకు టాలీవుడ్ అగ్ర నటుడు మెగాస్టార్ చిరంజీవి గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు.
దిశ, సినిమా: తెలుగు ప్రజలకు టాలీవుడ్ అగ్ర నటుడు మెగాస్టార్ చిరంజీవి గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. తన అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న చిరు ఇప్పటికి యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. చివరగా విడుదలైన మెగాస్టార్ ‘భోళా శంకర్’ చిత్రం బాక్సాఫీసు వద్ద దారుణంగా బోల్తా పడింది. దీంతో చిరంజీవి ఎలాగైన భారీ హిట్ కొట్టాలని ‘విశ్వంభర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ త్రిష కథానాయికగా మెరవనుంది. ఇదంతా పక్కన పెడితే..
మెగాస్టార్ ఫ్యామిలీ గురించి స్పెషల్‌గా చెప్పనవసరం లేదు. మెగా కుటుంబం మొత్తం ఎంతో అన్యోన్యంగా కలిసి మెలిసి జీవిస్తున్నారు. అయితే షూటింగ్ కారణంగా బిజీలో పడి, వీరి మధ్య విభేదాలు వచ్చే చాన్స్ ఉందని చిరు ముందే గ్రహించాడంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఎక్కడ ఫ్యామిలీ విడిపోతుందనే ఉద్దేశంతో మెగాస్టార్ ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టారట. ఈ కారణంగానే మెగా కుటుంబం ఇప్పటికి కలిసిమెలసి ఉంటున్నారట. చిరు ప్లాన్ ఏంటంటే.. ఎవరూ ఎంత బిజీగా ఉన్నా నెలలో తప్పకుండా రెండు సార్లు అంతా కలిసి జాయ్ ఫుల్‌గా గడపాలని రూల్ పెట్టారట. ఏమైనా గొడవలైన అందరూ ఒకే చోట మీట్ అయ్యాక తప్పకుండా మాట్లాడుకోవాలని చెప్పారట. ఇలా కలిసి చోట ఒకరికొకరు సుఖదుఃఖాలను పంచుకుంటూ ఉంటారట. చిన్న చిన్న గొడవలు ఉన్నా మర్చిపోయి సంతోషంగా గడుపుతారట. కాగా ఈ కారణంగా మెగా ఫ్యామిలీ ఇప్పటికి హ్యాపీగా ఎలాంటి గొడవలు లేకుండా ఉందని నెట్టింట ఓ వార్త వైరల్ అవుతోంది. దీంతో మెగాస్టార్ చిరంజీవిపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.