MegaStar Chiranjeevi: మలావత్ పూర్ణ, కావ్య మన్యపులకు 'మెగా' ప్రశంసలు
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి సేవాగుణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కష్టం వచ్చిందని ఎవరు ఆయన ఇంటి తలుపు తట్టినా సాయం చేసే వ్యక్తి మెగాస్టార్.
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలెంట్ ఉన్న యువ దర్శకులకు, టెక్సిషీయన్లకు అవకాశాలిచ్చి ప్రొత్సహించే వ్యక్తుల్లో చిరు ముందే ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా.. అతిపిన్న వయస్సులోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన పర్వతారోహకురాలు మాలావత్ పూర్ణ, నాసా సైంటిస్ట్ కావ్య మన్యపులను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. వారు చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా వారిద్దరినీ చిరు సన్మానించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన ట్వీట్‌లో పోస్టు చేశారు. వారు చేసిన ఘనతల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి అమ్మాయిలో ప్రపంచాన్ని మార్చే శక్తి ఉంటుందని, ఇద్దరు డైనమిక్ యువతులు కావ్య మన్యపు, పూర్ణా మాలావత్‌లు నిరూపించారని ప్రశంసించారు. విద్య, చైతన్యం, సాధికారిత దిశగా అణగారిన వర్గాల బాలికలను నడిపించేందుకు 'ప్రాజెక్టు శక్తి' చేపట్టారని, వారు చేస్తున్న ప్రయత్నాలను అభినందిస్తున్నట్లు వెల్లడించారు.