మెగా vs అల్లు ఫ్యామిలీ.. బన్నీనీ ఏకిపారేసిన నాగబాబు.. ట్వీట్ వైరల్

ఏపీ, తెలంగాణల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు, తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాల్లో సోమవారం నాడు పోలింగ్ ప్రక్రియ జరిగింది.

Update: 2024-05-14 04:51 GMT

దిశ, సినిమా: ఏపీ, తెలంగాణల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు, తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాల్లో సోమవారం నాడు పోలింగ్ ప్రక్రియ జరిగింది. అయితే ఏపీ ఎన్నికలు మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి మధ్య పొలిటికల్ గోడలు కట్టేశాయి అని చెప్పుకోవచ్చు.

పిఠాపురం అసెంబ్లీ స్థానానికి పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న సందర్భంలో మెగా ఫ్యామిలీ మొత్తం ఆయనకు అండగా నిలిచింది. నాగబాబు కుటుంబం సహా మెగా మేనల్లుళ్లు నేరుగా రంగంలోకి దిగి ప్రచారం చేశారు. చిరంజీవి వీడియో సందేశం ఇవ్వగా, చివర్లో రామ్ చరణ్.. బాబాయ్ కోసం పిఠాపురం వచ్చారు. అయితే పవన్ కల్యాణ్ కు మద్దతుగా ట్వీట్ చేసి సరిపెట్టిన అల్లు అర్జున్ మాత్రం తన స్నేహితుడైన వైసీపీ అభ్యర్థి కోసం నంద్యాల రావడం, తన స్నేహితుడిని గెలిపించాలని బన్నీ ఓటర్లకు పిలుపునిచ్చారు. దీంతో బన్నీ వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారనే ప్రచారం జరిగింది. దీంతో జనసైనికులకు కోపం వచ్చింది.

అయితే తాజాగా నాగబాబు వేసిన ట్వీట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని మరింత రెచ్చగొట్టేలా ఉంది. బన్నీ పేరెత్తకుండానే నాగబాబు ఘాటు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో భాగంగా "మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడైన పరాయివాడు, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే...!" అంటూ అల్లు అర్జున్ పేరెత్తకుండా ఇన్ డైరక్ట్‌గా అసలు విషయం చెప్పారు నాగబాబు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతుంది.

Tags:    

Similar News