కొత్త రికార్డు సాధించిన " Masooda " సినిమా !

'స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్' పతాకం‌పై వచ్చిన మూడో సినిమా " మసూద ".

Update: 2022-11-29 03:14 GMT

దిశ, వెబ్ డెస్క్ : 'స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్' పతాకం‌పై వచ్చిన మూడో సినిమా " మసూద ". ఈ సినిమాలో " గంగోత్రి " లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ కావ్య కళ్యాణ్ రామ్ లీడ్ రోల్ చేయగా , సంగీత, తిరువీర్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో..సినిమా‌పై కూడా అంచనాలు పెరిగాయి. ఈ సినిమా నవంబర్ 18 న ప్రేక్షుకుల ముందుకు వచ్చింది. 10 రోజుల కలెక్షన్స్ చూసుకుంటే..

నైజాం - 01.75 Cr

సీడెడ్ - 0.58 L

ఆంధ్ర - 1.51 Cr

ఏపీ + తెలంగాణ - 03.84 Cr

రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ - 0.18 L

టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 04.02 Cr

ఈ సినిమాకు రూ.1.25 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మొత్తానికి ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌‌ సాధించి హిట్ కొట్టి బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. మొదటి రోజు మొదటి షో నుంచి సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో.. ఈ సినిమా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. " మాసూద " సినిమా పది రోజుల్లో రూ. 04.02 కోట్లను కలెక్టు చేసింది.  

ఇవి కూడా చదవండి : చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్టైన " Love Today "

Tags:    

Similar News